ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (17:32 IST)

పేరుకు ఆర్ఎంపీ వైద్యుడు.. కోడికూర వండలేదని.. కన్నతల్లినే హతమార్చాడు..

క్షణికావేశంతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన ఓ కుమారుడు.. ఏకంగా కన్నతల్లినే హతమార్చాడు. చికెన్ వండలేదని కన్నతల్లినే హతమార్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల

క్షణికావేశంతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన ఓ కుమారుడు.. ఏకంగా కన్నతల్లినే హతమార్చాడు. చికెన్ వండలేదని కన్నతల్లినే హతమార్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
బాగా మద్యం తాగి ఇంటికొచ్చిన కిషోర్ అనే వ్యక్తి తన తల్లి మరియమ్మ (60) ని అన్నం పెట్టమన్నాడు. అయితే, చికెన్ కూర వండలేదని తెలుసుకున్న కిశోర్‌.. ఆగ్రహంతో ఊగిపోయి కత్తితో కన్నతల్లిని పొడిచి హత్య చేశాడు. 
 
నిందితుడు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడని, ఆస్తి విషయంలోనూ కొన్ని రోజులుగా తల్లితో గొడవ పడుతున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. కిశోర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆస్తి విషయంలో మరియమ్మ కిషోర్‌కు వత్తాసు పలకలేదనేది కూడా ఈ  హత్యకు కారణమై వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.