శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (17:14 IST)

పురిటి బిడ్డని ప్లాస్టిక్ కవరులో చుట్టి వదిలేసి వెళ్లిన కసాయి తల్లి.. ఎక్కడ?

పురిటి బిడ్డని ప్లాస్టిక్ కవరులో చుట్టిన ఓ కసాయి తల్లి అక్కడే వదిలేసి వెళ్లింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు పరిధిలోని 5వ లైన్ గుంటూరి వారితోట పరిధిలోని క్రిస్టియన్ పేట కొత్తపేట పరిధిలో అమానుష సంఘటన జరిగింది. 
 
సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన స్థానికుల సమాచారంతో ఆయా పరిధిలోని సీఐ ఆధ్వర్యంలో పోలిస్ సిబ్బంది ఆ బాబుని గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. 
 
ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు. ప్లాస్టిక్ కవరులో పసికందును చుట్టి వదిలేసి వెళ్లిన ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.