బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (22:22 IST)

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడింది.. వీల్ ఛైర్‌కే పరిమితమైంది..

cell phone
స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం గడవని రోజులివి. అన్నం లేకుండా వుంటారేమో కానీ స్మార్ట్ ఫోన్ లేనిదే చాలామంది వుండలేరు. ప్రస్తుతం జీవనంలో స్మార్ట్ ఫోన్ ఓ భాగమైపోయింది. అయితే స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తే.. కంటితో పలు అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అయినా స్మార్ట్ ఫోన్ల వాడకం ఏ మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే ఫోన్ వాడకం వల్ల కళ్ళు, వెన్నునొప్పి, చేతులు తిమ్మిర్లు లాంటి సమస్యలు చాలానే వింటున్నాం. ఇప్పుడు మరో కొత్త సమస్య బయటపడింది.
 
అతిగా ఫోన్ వాడడం వలన చిన్న వయసులోనే వీల్ ఛైర్ కి పరిమితం అయింది ఓ అమ్మాయి. యూకేకి చెందిన 29 ఏళ్ళ ఫెనెల్లా ఫాక్స్ చాలా ఎక్కువగా ఫోన్ వాడి వెర్టిగో సమస్యను కొని తెచ్చుకుంది. 
 
ప్రతిరోజూ సోషల్ మీడియాలో 14 గంటలు ఆమె గడిపేదట. దీంతో ఫెనెల్లా వెర్టిగో బారిన పడింది. ఫెనెల్లాకు సమస్య మొదట్లో చిన్నగానే ఉండేది. తలనొప్పి, మైకం లాంటివి అప్పుడప్పుడూ వచ్చేవి. తర్వాత అదే పెద్దగా అయింది. చివరకు నడవడం కూడా కష్టం అయిందని ఆమె వాపోయింది.