శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (14:24 IST)

తిరుమలలోని హోటల్‌ మరుగుదొడ్డిలో మహిళకు ఆత్మహత్య

తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న ఒక హోటల్ మరుగుదొడ్డిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని విజయవాడకు చెందిన సుమతిగా గుర్తించారు. ఈమె తిరుమలలో ఒక హోటల్‌లో పని చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న మరుగుదొడ్డి నుంచి భారీగా పొగలు రావడంతో అక్కుడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరుగుదొడ్డి తలుపులు పగులగొట్టి చూశారు. అందులో ఒక మహిళ మంటల్లో దహనమవుతూ కనిపించింది. ఆమెను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 
 
అప్పటికే ఆమె శరీరం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆదివారం రాత్రి గంటల సమయంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, మృతురాలిని విజయవాడకు చెందిన సుమతి (53) అనే మహిళగా గుర్తించగా, తిరుపతిలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నట్టుగా నిర్ధారించారు.