1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

పేర్లు - రంగులు మార్చడం సీఎం జగన్‌కు ఉన్న జబ్బేమో : చంద్రబాబు సెటైర్లు

chandrababu
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు వంగ్యాస్త్రాలు సంధించారు. పేర్లు, రంగులు మార్చడం ఆయనకు ఉన్న జబ్బేమో అంటూ సెటైర్లు వేశారు. విజయవాడలోని ప్రఖ్యాత తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో తుమ్మలపల్లి, క్షేత్రయ్యల పేర్లను మున్సిపల్ అధికారులు తొలగించడం వివాదాస్పదంతో పాటు చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యను సాహితీ ప్రియులతో పాటు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. 
 
ఇదే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ, స్థలం ఇచ్చిన దాత తుమ్మలపల్లి శ్రీహరి గారి పేరు, సుప్రిసిద్ధ వాగ్గేయకారుడు క్షేత్రయ్య పేరు... రెండూ తీసేశారని మండిపడ్డారు. ఇపుడు కళాక్షేత్రానికి ఏ దోపిడీదారుడి పేరు పెడతారంటూ సెటైర్ వేశారు. పైగా, పేర్లు మార్చడం, రంగులు వేయడం ఆయనకున్న జబ్బేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
అయితే ఈ కళాక్షేత్రానికి పేర్లు మార్చినట్టు వచ్చిన వార్తలపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ వివరణ ఇచ్చారు. తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పునర్‌నిర్మాణంలో భాగంగా ఎలివేషన్ భాగం పునరుద్ధరించేందుకు పేరు తొలగించామని వివరణ ఇ్చచారు. నేమ్ బోర్డు తయారు కాగానే అతి త్వరలోనే పూర్తి పేరుతో బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. పేరును హైలెట్ చేయడానికి గ్లో సైన్ బోర్డుతో రూపొందించినట్టు కమిషనర్ వెల్లడించారు.