గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (20:24 IST)

విషమంగా తారకరత్న ఆరోగ్యం: బెంగళూరు నారాయణ ఆసుపత్రికి చంద్రబాబు

Chandrababu
కర్టెసి-ట్విట్టర్
నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉండడంతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. తారకరత్నను కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు పరామర్శిస్తున్నారు. 
 
స్పెషాలిటీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే అంతర్గత రక్తస్రావం, అధిక గ్లూకోజ్ స్థాయిల కారణంగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్స పురోగతిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ నిశితంగా పరిశీలిస్తున్నారు. 
 
తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం బెంగళూరుకు చేరుకోనున్నారు.   తారకరత్నను సందర్శించడానికి జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.