1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (17:18 IST)

తారకరత్న కోసం అలేఖ్యారెడ్డి మృత్యుంజయ హోమం..

నందమూరి హీరో తారకరత్న ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గా వుందనే విషయం తెలుసున్న ఆయన భార్య అలేఖ్యారెడ్డి ప్రత్యేక పూజల కోసం ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరు.. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తూ.. ప్రత్యేక హోమం ఏర్పాటు చేశారు.  
 
బెంగుళూరులోని ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వెయ్యి మంది పురోహితులతో తారకరత్న ఆరోగ్యం కోసం ఆయన పేరు మీద మృత్యుంజయ హోమం చేయిస్తున్నారు అలేఖ్య రెడ్డి. మృత్యుంజయ హోమం చేయిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోయి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంటుందని.. ఆయన కోలుకుంటారని ఆమె భావిస్తున్నారు.