శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (09:46 IST)

అరండల్ పేటలో బోరుగడ్డ అనిల్ కుమార్ క్యాంపు ఆఫీసుకు నిప్పు

borugadda anil office
విజయవాడలోని అరండల్ పేటలోని బోరుగడ్డ అనిల్ కుమార్ క్యాంపు కార్యాలయానికి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎవరూ లేని సమయంలో ఆరుగురు వ్యక్తులు కార్యాలయానికి వచ్చి ఆవరణలో గ్యాసోలిన్ పోసి నిప్పంటించారని, అడ్డుకోబోయిన తనపై కూడా దాడి చేశారని వాచ్‌మెన్ వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నీచర్‌ పూర్తిగా కాలిపోయింది.
 
సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ దాడికి సంబంధించి పలువురిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.