ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (17:14 IST)

అనుకోకుండా హీరో అయ్యా, దానికి ప్రభుత్వం పర్మిషన్‌ లేదు: సుహాస్

Suhas
Suhas
విజయవాడకు చెందిన ఫ్రెండ్స్  కొంత మంది కలిసి సినిమా పరిశ్రమకు వెళ్లాలని అనుకున్నాము. నా ఫ్రెండ్స్ రచయితలు. నేను ఒక్కడినే రచయితను కాదు. సినిమాలు జడ్జి చేస్తుంటాను. అలా చాయ్‌ బిస్కట్‌ అనే సోషల్‌ మీడియాలో పనిచేశాం. ఏదైనా వేషం వేయాలని కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాను. అనుకోకుండా నన్ను హీరో పెట్టి కలర్‌ ఫొటో నా స్నేహితుడు దర్శకత్వంలో వచ్చింది. దానికి మంచి పేరు వచ్చిందని.. హీరో సుహాస్‌ తెలిపారు.
 
సుహాస్‌ నటించిన  ‘రైటర్ పద్మభూషణ్‌ ఫిబ్రవరి 3న విడుదల. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు.  సుహాస్‌ పలు విషయాలు తెలిపారు. 
 
- ప్రచారంలో భాగంగా ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను. విజయవాడ స్వంత ఊరు ఇక్కడ పెద్ద కటౌట్‌ పెట్టాలని వున్నా, ప్రభుత్వం ఇలాంటివాటికి పర్మిషన్‌ ఇవ్వదు.
 
- ప్రశాంత్ ‘కలర్ ఫోటో’ సినిమాకి సహాయ దర్శకుడు. తర్వాత ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమా చేశాను. దానికి ప్రశాంత్ రైటర్. తను అలా పరిచయం. కలర్ ఫోటో తర్వాత ఈ కథ చెప్పాడు. చాలా ఎక్సయిట్ అయ్యాం. నిర్మాతలు అనురాగ్, శరత్ కి చెప్పాం. వారూ ఎక్సయిట్ అయ్యి వెంటనే తెరకెక్కించారు.
 
- రైటర్ అయిపోవాలని కలలు  కనే పాత్ర నాది. పూర్తి వినోదంగా ఉంటుంది. నేను సెట్ కు టైంకు ముందే వస్తాను.  కొంచెం ముందే వెళ్ళిపోతే పనులు సరైన సమయంలో జరుగుతాయి. హను రాఘవపుడి, శివ నిర్వాణ లాంటి దర్శకులతో పని చేస్తున్నపుడు ఇది అలవాటైయింది. వాళ్ళు ఉదయం ఐదు గంటలకే సెట్ లో వుంటారు. అలా వుండట వలన పనులు ఫాస్ట్ గా నడుస్తాయి. ఈ సినిమాకి అరవై రోజులు అనుకున్నాం, కానీ 43 రోజుల్లోనే పూర్తి చేశామంటే దానికి కారణం ఇదే.
 
- డ్రీం రోల్స్ లేవు. చిన్న పాత్రలు చేస్తే చాలు అని అనుకున్నాను. చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. రచయితల వలన చాలా భిన్నమైన పాత్రలు చేసే అవకాశం వస్తుంది. వచ్చిన పాత్రకు ఎలా న్యాయం చేయాలనే దానిపైనె నా ద్రుష్టి వుంది.
 
- నా తర్వాత సినిమా గీతా ఆర్ట్స్ 2 లో వస్తోంది. షూటింగ్ పూర్తయింది. తర్వాత ఆనందరావు అడ్వంచర్స్ అనే మరో సినిమా చేస్తున్నాను. అన్ని మంచి కథలు. త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులకు చూపించాలనే ఎక్సయిట్ మెంట్ వుంది.