మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (15:39 IST)

తెదేపా నేతలపై వరుస కేసుల నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. మొత్తం 11 మంది టీడీపీ నేతల పేర్లతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. అందులో గుర్తు తెలియని మరో 30 మంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 
 
ఎఫ్ఐఆర్‌లో చేర్చిన పేర్లలో పట్టాభి, గొట్టిముక్కల, రఘురామరాజు, చెన్నుపాటి గాంధీ, నాగూల్ మీరా, గద్దె రామ్మోహన్ రావు, సుంకర విఘ్ణ, నాదెండ్ల బ్రహ్మం, బోడె ప్రసాద్, జంగాల సాంబశివరావు, బుద్దా వెంకన్న, తమ్మా శంకర్ రెడ్డి, గుర్తుతెలియని మరో 30 మంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  
 
ఇదిలావుంటే, తెదేపా నేతలపై తాడేపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తెదేపా నేతలపై.. తాడేపల్లి ఏఎస్​ఐ మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయం గేట్లు నెట్టివేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. 
 
డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్‌రెడ్డి, ఆలపాటి రాజేంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, బోడె ప్రసాద్, తెనాలి శ్రావణ్‌, జీవీ ఆంజనేయులు, నజీర్‍పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.