శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (13:15 IST)

చివరి దశకు చేరుకున్న ప్రభాస్ 'ఆదిపురుష్' షూటింగ్

ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం "ఆదిపురుష్". ఈ చిత్రం శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‏గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ లాంగ్ షెడ్యూ్ల్ ముంబైలో ప్రారంభమైంది.
 
ఈ షెడ్యూల్ దాదాపు 25 రోజులపాటు జరుగుతుందని సమాచారం. ఇందులో ముఖ్యంగా క్లైమాక్స్‏లో వచ్చే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్‏కు సంబంధించిన రిహార్సల్స్ కూడా ప్రారంభించారట. ముందుగా యాక్షన్ సీన్స్, ఆ తర్వాత టాకీ పార్ట్ చిత్రీకరిస్తారని సమాచారం. 
 
భారీ బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ మైథాలజీ ఫిల్మ్‏లో ప్రభాస్ రాముడిగాను, కృతిసనన్ సీతగా కనిపించబోతున్నారు. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపిస్తారు. 
 
ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు. ఇక ప్రభాస్.. పూజాహెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.