శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:06 IST)

ఇన్‌స్టాలో 'బాహుబలి' ప్రభాస్ ప్రభంజనం

ఇన్‌స్టా గ్రామ్‌లో బాహుబలి ప్రభాస్ ప్రభంజనం సృష్టించారు. రెండేళ్ల క్రితం ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇవ్వ‌గా ప్రభాస్... ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. తాజాగా ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌భాస్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 7 మిలియ‌న్స్‌కి చేరుకోవ‌డంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. 
 
ఒక్క బాహుబలి చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ ఇపుడు అన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను మాత్రమే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు.
 
అయితే ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్ ఉండ‌డ‌నే చెప్పాలి. ఇక ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే 'రాధేశ్యామ్' చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. 
 
అలాగే, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్నారు. త్వ‌ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ కూడా మొద‌లు పెట్ట‌నున్నాడు. అయితే ప్ర‌భాస్ న‌టించిన‌ రాధేశ్యామ్ జనవరి 14న విడుదల కానుంది. 
 
ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ రానా భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాట, వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్3 సినిమాలు కూడా విడుదల కానున్నాయి. పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అదే తేదీన ఫిక్స్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.