శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (17:56 IST)

బాలీవుడ్ డైరెక్టరుతో ప్రభాస్ : మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా!

తెలుగు హీరో నుంచి ఇంటర్నేషనల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయిన హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈయన వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇపుడు మరో కొత్త ప్రాజెక్టును చేపట్టారు. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌తో సినిమా చేసేందుకు సమ్మతం తెలిపారు. ఈ చిత్రంలో "రా" ఏజెంటుగా ప్రభావ్ నటించనున్నట్టు సమాచారం. 
 
ఈ వార్త ఇపుడు వార్త అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యాక్ష‌న్ ఓరియెంట్ క‌థాంశాన్ని సిద్దార్థ్ ఆనంద్ ఇటీవ‌లే ప్ర‌భాస్కు వినిపించ‌గా.. అది ప్ర‌భాస్‌కు బాగా న‌చ్చింద‌ట‌. టాలీవుడ్‌లో 'వ‌న్ ఆఫ్ ది లీడింగ్' బ్యాన‌ర్ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుండ‌టం విశేషం. ప్ర‌భాస్ - సిద్దార్థ్ ఆనంద్ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుందని బీటౌన్ వ‌ర్గాల స‌మాచారం.
 
ఇదిలావుంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలోవున్న సినిమాలు పూర్తి చేయ‌గానే సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. మొత్తానికి ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ త‌న అభిమానుల‌కు ఊపిరాడ‌కుండా చేసేందుకు రెడీ అవుతున్నాడు.