ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (08:46 IST)

ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు అరెస్టు.. సొంత పూచీకత్తుపై విడుదల

uyyuru srinivasa rao
ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస రావును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు ఆయనను విడుదల చేసింది. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
 
ఆదివారం గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నగారి జనతా వస్త్రాలు, చందన్న కానుకల పంపిణీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. దీంతో గుంటూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పలు సెక్షన్లు నమోదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను స్థానిక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే, శ్రీనివాస్‌కు రిమాండ్ విధించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304(2) నుంచి శ్రీనివాస్‌కు మినహాయింపు లభించింది. ఆ తర్వాత రూ.25 వేల పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.