ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (17:04 IST)

పిల్లి వేలు కొరికింది.. మనిషి ప్రాణాలు పోయాయి..

Cats Massaging Dog
పిల్లిని ఇంట్లో పెంచుతున్నారా.. అయితే జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే ఇంట్లో ముద్దుగా పెంచుకున్న పెంపుడు పిల్లి పొరపాటున కొరికిన కారణంగా ఓ వ్యక్తి మరణించిన ఘటన డెన్మార్క్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. డెన్మార్క్‌కు చెందిన హెన్రిచ్ క్రీగ్ బామ ప్లాట్‌నర్ (33) అనే వ్యక్తి 2018లో ఒక పిల్లి, దాని పిల్లులను పెంచుకునేందుకు తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ పిల్లి పిల్లల సంరక్షణ సమయంలో పిల్లిపిల్ల హెన్రిక్ వేలు కొరికింది. 
 
అయితే హెన్రిచ్ ఆ గాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత అతని వేలు బాగా వాచిపోయింది. దీంతో హెన్రిచ్ డెన్మార్క్‌లోని కోడింగ్ ఆస్పత్రికి చెందిన వైద్యులను సంప్రదించాడు. వైద్యుల సిఫార్సు మేరకు ఆస్పత్రిలో చేరాడు. దీంతో హెన్రిచ్‌కు మాంసం కొరుక్కుతినే బ్యాక్టీరియా సోకింది. 
 
అతడిని కాపాడేందుకు డాక్టర్లు దాదాపు 15 ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్లు జరిగిన నాలుగు నెలలు గడిచినా.. ఫలితం లేదు. అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో అక్టోబర్ నెలలోనే హెన్రిచ్ మృత్యువాత పడ్డాడు.