శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (16:46 IST)

అంగట్లో నకిలీ సర్టిఫికేట్లు - విజయవాడ ఎస్ఆర్ పేటలో విక్రయం

students
విజయవాడ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికేట్ల భాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఎస్ఆర్ పేటలో ఉన్న పదో తరగతికి సంబంధించి నకిలీ సర్టిఫికేట్లును తయారు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. మధ్యవర్తుల ద్వారా అన్నామలై విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఈ నకిలీ సర్టిఫికేట్లను ఇప్పిస్తున్నట్టు తేలింది. ఒక్కో సర్టిఫికేట్‌ను అనంతపురం యువకులు లక్షన్నర రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. పరీక్ష రాయకుండానే నేరుగా పది రోజుల్లో నేరుగా సర్టిఫికేట్ ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. 
 
ఈ నకిలీ సర్టిఫికేట్లతో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెరిఫికేషన్‌లో అవి నకిలీ సర్టిఫికేట్లని తేలాయి. దీంతో బాధిత విద్యార్థులు మధ్యవర్తి ఆనంద్‌ను నిలదీయగా, అవి ఒరిజినల్ సర్టిఫికేట్లేనని యూనివర్శిటీ ప్రతినిధులు చెబుతున్నారని దబాయిస్తున్నారు. అయితే, బాధిత విద్యార్థులు మాత్రం తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.