1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (08:53 IST)

ఏపీ ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు : కేంద్రం స్పష్టీకరణ

andhra pradesh map
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్రం తన వైఖరిని మరోమారు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని రాజ్యసభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
 
రాజ్యసభలో వైకాపా ఎంపీ సుభాష్ చంద్రబోస్ విభజన చట్టం మేరకు ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏమైందంటూ అడిగిన ప్రశ్నకు మంత్రి ఇంద్రజిత్ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు.
 
వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.సి) కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందన్నారు. 14వ ఆర్థిక సంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అంశంలో ఎలాంటి వ్యత్యాసం చూపలేదని, అందువల్ల ఏపీ ప్రత్యేకహోదా అంశం ఉనికిలోనే లేదని స్పష్టం చేశారు.