ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (10:53 IST)

ఏపీకి వచ్చిన తెలంగాణ వారి స్థానికత పెంపు : రాష్ట్రపతి ఉత్తర్వులు

president bhavan
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. వారి స్థానికను పదేళ్ళపాటు మరోమారు పొడగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఏడేళ్లపాటు స్థానికతను కల్పించారు. ఆ మేరకు గత 2014లో అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. 
 
అయితే, ఈ గడువు ముగిసిపోవడంతో స్థానికతను మరో మూడేళ్లు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి గత ఆదేశాల్లో సవరణ చేసి... మరో మూడేళ్ల పాటు స్థానికత అమల్లో ఉండేలా తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను వెల్లడించింది.