సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 28 జనవరి 2022 (11:09 IST)

ఎక్స‌ర్ సైజ్ చేస్తూ... అప‌స్మార‌కం, వెయిట్ లిఫ్టర్ రఘు మృతి

క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తే, ఆరోగ్యానికి మంచిది అని అంద‌రూ చెపుతారు. కానీ, అదే వ్యాయామం చేస్తూ, మ‌ర‌ణించిన వారు ఇటీవ‌ల చాలా మంది ఉన్నారు. ఇటీవ‌ల హీరో పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం ఇంకా సీనీ అభిమానులంద‌రినీ బాధిస్తూనే ఉంది. ఇపుడు ఆ జాబితాలోకి మ‌రో యువ‌కుడు చేరాడు.
 
 
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్, రా జిమ్ సెంటర్ అధినేత వీరమాచినేని రాజా రఘురామ్ శుక్రవారం ఉదయం మృతి చెందారు. వ్యాయామం చేస్తూ, అపస్మారక స్థితిలోకి జారుకుని తుది శ్వాస విడిచారు. అత‌ని వ‌య‌సు కేవ‌లం 26 ఏళ్ళు కావ‌డం మ‌రీ దారుణం అని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ర‌ఘ‌రాం మ‌న రాష్ట్రం తరుపున దేశ స్థాయిలో జరిగిన వివిధ పోటీల్లో పలు పతకాలు సాధించి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో హనుమాన్ జంక్షన్ పేరును ఇనుమడింప చేశారు. అలాంటి ర‌ఘ చనిపోవ‌డంపై అంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు.