స్కూలు బస్సు డ్రైవరు గుండె ఆగింది.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు
విజయవాడ నగరంలో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూలు బస్సు డ్రైవరుకు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో అతను స్టీరింగ్‌పై తలవాల్చి తుదిశ్వాస విడిచాడు. అయితే, ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఏరియాల్లో బెంజ్ సర్కిల్ ఒకటి. ఈ ప్రాంతంలో ఓ పాఠశాల బస్సు డ్రైవరు బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతను స్టీరింగ్‌పైనే తలవాల్సి మృతి చెందాడు. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ బస్సును నలంద విద్యా సంస్థలకు చెందిన బస్సుగా గుర్తించారు. అలాగే, మృతుడు పేరు సాంబయ్య అని పోలీసులు చెప్పారు. తీవ్ర గుండెపోటు రావడంతో బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి, స్టీరింగ్‌పై తలవాల్సి తుదిశ్వాస విడిచాడని, దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వివరించారు.