సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (13:22 IST)

కేసీఆర్‌తో మాట్లాడితే తప్పేంటి? పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయితే తప్పేముందని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నూతన సంవత్సరం రోజున కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు చెబితే ఇంత రచ్చ చేయల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయితే తప్పేముందని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నూతన సంవత్సరం రోజున కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు చెబితే ఇంత రచ్చ చేయల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం ప్రజలు ఓటుతో తీర్పునిస్తే ఆయన గెలిచారని చెప్పారు. 
 
ఏ పార్టీకైనా సరే ప్రజలు పట్టం కట్టినప్పుడు ఆయా ప్రభుత్వాలను గౌరవించాలని పవన్ అన్నారు. కరీంనగర్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దశాబ్దాల తరువాత తెలంగాణ వచ్చిందని, తానెప్పుడూ సునిశితంగా ఆలోచిస్తానని, బాధ్యతగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తానని తెలిపారు. 
 
ప్రభుత్వాలపై విమర్శలు చేయడం కోసం తాను పనిచేయట్లేదని.. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని.. వాటిని ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. ఆ దిశగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
 
విమర్శలకు తావిచ్చి రాజకీయాలను అస్థిరపరిచే ఉద్దేశం తనకు లేదని పవన్ స్పష్టం చేశారు. విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాలకు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పలు సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని పవన్ వ్యాఖ్యానించారు.