తిరుపతిలోని అలిపిరిలో భారీగా లిక్కర్ ధ్వంసం
తిరుపతిలోని అలిపిరి వద్ద మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశారు ఎస్.ఇ.బి, టిటిడి విజిలెన్స్ సిబ్బంది. 1061 బాటిళ్ళు, 319 లీటర్ల మద్యంను ధ్వంసం చేశారు. జూలై 2019 నుంచి మార్చి 10 వరకు సప్తగిరి తనిఖీ కేంద్రంలో భక్తుల నుంచి మద్యం బాటిళ్ళ స్వాధీనం చేసుకున్నారు.
కొంతమంది మద్యం బాటిళ్లను తెలియకుండా తీసుకొస్తే, మరి కొంతమంది కావాలనే తిరుమలకు మద్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారు అలిపిరి లోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ సెక్యూరిటీ తనిఖీల్లో బయటపడతారు.
భక్తులు చెప్పే సమాధానం బట్టి టీటీడీ సెక్యూరిటీ కేసుల రాస్తుంటుంది. ఇష్టం వచ్చినట్లు సమాధానం చెబితే నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం.. తెలియకుండా పొరపాటున జరిగిందని చెబితే ఫైన్లు వేసి పంపేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఇదేవిధంగా మద్యం బాటిళ్లను టీటీడీ సెక్యూరిటీ ధ్వంసం చేస్తూ వస్తోంది.