శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (21:05 IST)

తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం.. దంచి కొడుతున్న వర్షాలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పడింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌, పరిగి, అరకు, విజయవాడలో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. 
 
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండకాసినా… సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. మబ్బులు పట్టి జోరుగా వాన పడింది. రాజేంద్రనగర్‌లో గంటసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
 
అటు ఏపీలోనూ వర్షం దంచి కొట్టింది. విశాఖ జిల్లా అరకులో కుండపోత వర్షం కురిసింది. ఘాట్‌రోడ్డు నదిని తలపించింది. పై నుంచి ఉధృతంగా వరదనీరు వస్తుండటంతో వాహనాలు నిలిచిపోయాయి. 
 
విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి బాడవపేట గంగానమ్మ వీధిలో రేకుల ఇళ్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. పలుచోట్ల రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది.