గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (15:25 IST)

ఏపీలో పరిషత్ ఎన్నికల రద్దుపై హైకోర్టు స్టే ట్విస్ట్

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసి, మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు బెంచ్ స్టే విధించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌3పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. 
 
రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ పరిషత్ ఎన్నికల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉందని ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. 
 
తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టరాదని స్పష్టం చేసింది. కాగా, విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే తాము ఎన్నికలు జరిపామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్‌కు నివేదించారు.