శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 31 ఆగస్టు 2019 (18:48 IST)

తెదేపా పరువు తీసిన కోడెల... కె ట్యాక్స్ పైన హైకోర్టు కీలక ఆదేశాలు

ఒకవైపు అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారానికి సంబంధించి కేసులు నమోదు అయ్యాయి. ఆ వ్యవహారంలో మొత్తం తెలుగుదేశం పార్టీ పరువే తీశారు కోడెల శివప్రసాదరావు. అదలా ఉంటే 'కే' ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకూ కే ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి బోలెడంత మంది ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఆ కేసుల విచారణ గురించి కోర్టు స్పందిస్తూ.. కోడెల శివప్రసాద్ రావు, ఆయన తనయుడు కోడెల శివరాంలు దిగువ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ ఆరో తేదీలోగా కోర్టుకు వెళ్లి లొంగిపోవాలని, అదే సమయంలో బెయిల్ కూడా లభిస్తుందని కోర్టు పేర్కొంది. అయితే విజయవాడను వీడి వారు బయటకు వెళ్లకూడదని కూడా కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
నమోదైన కేసుల విచారణ కోసం పోలీసులకు అందుబాటులో ఉండాలని కోర్టు పేర్కొంది. ప్రతి సోమ, బుధ, శనివారాల్లో ఆ కేసుల విచారణ కోసం పోలీసుల ముందుకు వెళ్లాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్షులను ప్రభావితం చేయడానికి వీల్లేదని కూడా వారిని కోర్టు ఆదేశించింది. ఈ కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేవరకూ కోడెల శివప్రసాద్, కోడెల శివరాంలు పోలీసుల ముందు హాజరు కావాలని పేర్కొంది.