మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 21 మే 2018 (12:20 IST)

వివాహితపై కన్నేశాడు.. భర్తకు స్లో పాయిజన్ ఇచ్చాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

వివాహితను ట్రాప్‌లో వేసుకునేందుకు ఓ వ్యక్తి పక్కా ప్లాన్ వేశాడు. కానీ అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. భార్యపై భర్తకు అనుమానం కలిగేలా చేశాడు. భర్తను అడ్డు తొలగించేందుకు కుట్ర చేశాడు. అంతాచేసి

వివాహితను ట్రాప్‌లో వేసుకునేందుకు ఓ వ్యక్తి పక్కా ప్లాన్ వేశాడు. కానీ అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. భార్యపై భర్తకు అనుమానం కలిగేలా చేశాడు. భర్తను అడ్డు తొలగించేందుకు కుట్ర చేశాడు. అంతాచేసి చివరికి బుక్కయ్యాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శ్రీకృష్ణానగర్ కాలనీలో బాధిత కుటుంబం నివాసముంటోంది. 
 
ఓసారి బాధిత వ్యక్తి మెట్లుదిగుతూ కాలు జారీ పడ్డాడు. దీంతో అంబులెన్సుకు ఫోన్ చేసింది భార్య.. అంబులెన్సుతో పాటు మాల్యాద్రి అనే వ్యక్తి  అక్కడికి చేరుకున్నాడు. అతనికి చికిత్స చేసిన అనంతరం రోజు ఫిజీయోథెరఫీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ పని తాను చేస్తానంటూ మాల్యాద్రి రోజు ఇంటికి వచ్చి అతనికి ఫిజీయోథెరఫీ చేసేవాడు. 
 
ఈ క్రమంలో పేషెంట్ భార్యపై కన్నేశాడు. భార్యకు ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వివరాలు సేకరించాడు. అంతేకాకుండా భార్యాభర్తల ఫోన్లు తీసుకుని ఓ యాప్ క్రియేట్ చేసి వారు రోజు ఏమి మాట్లాడుకుంటుందని ట్రాప్ చేశాడు. ఎవరో అజ్ఞాతవ్యక్తి రాసినట్టు లెటర్ రాసి భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నం చేశాడు. 
 
చివరికి వివాహిత పుట్టింటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన మాల్యాద్రి.. ఆమె భర్తను హత్య చేసి ఆమెను శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా పది రోజుల ముందే ఆమె భర్తకు స్లో పాయిజన్‌ ఇచ్చాడు. ఒకవేళ హత్యాప్లాన్ వికటిస్తే.. అతడిని మంచానికే పరిమితం చేయొచ్చు. తద్వారా ఆమె తనకే సొంతం అవుతుందనే కుట్ర చేశాడు.
 
అయితే ఇదంతా ఎవరో చేస్తున్న కుట్రగా భావించిన వివాహిత భర్త.. అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో మాల్యాద్రినే ఈ తతంగానికి సూత్రధారి అని తేల్చారు. ఇంకా అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.