వివేక హత్యపై సీబీఐతో విచారణ జరపాలని నేనే కోరా: ఆదినారాయణరెడ్డి
వివేక హత్యపై సీబీఐ విచారణ జరపాలని తానే కోర్టులో రిట్ వేశానని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చెప్పారు. భయపడే వ్యక్తిని అయితే సీబీఐ విచారణ ఎందుకు కోరతానని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.
స్థానికంగా ఉండే పోలీసులపై నమ్మకం లేదని, తనపై ఎలాంటి ఆరోపణలు రాకూడదనే ఉద్దేశంతోనే సీబీఐ విచారణ కోరినట్లు చెప్పారు. ఇంతవరకు జరిగిన నష్టం జరిగిపోయిందని, ఇకపై ఫ్యాక్షన్ వద్దని, అభివృద్ది చేసుకుందామని పిలుపు ఇచ్చానన్నారు.
రాజశేఖర్ రెడ్డి, జగన్‌తో సన్నిహితంగా ఉన్న వ్యక్తినని చెప్పారు. తాను బీజేపీ పార్టీలో చేరి 250 రోజులు అయిందని, తాను ఢిల్లీలో కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నానని చెప్పారు. మిగిలిన రోజులు పనులు చేసుకుంటు కడపజిల్లా తన గ్రామంలో ఉన్నానని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు.