శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 7 మార్చి 2017 (15:26 IST)

బాబు అడవిలో అసెంబ్లీ కట్టగలరు... పవన్ పైన 10 ఓట్ల తేడాతో గెలుస్తా... జలీల్ ఖాన్

వైసీపీ నుంచి జంప్ అయి తెదేపాలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తనదైన వ్యాఖ్యలను ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తే తను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైన కూడా 10 ఓట్ల తేడాతో గెలిచే సత్తా వుందని చెప్పుకున్నారు. తనకు ఎన్నికలంటే అసలు

వైసీపీ నుంచి జంప్ అయి తెదేపాలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తనదైన వ్యాఖ్యలను ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తే తను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైన కూడా 10 ఓట్ల తేడాతో గెలిచే సత్తా వుందని చెప్పుకున్నారు. తనకు ఎన్నికలంటే అసలు భయం లేదనీ, ఎన్నికల్లో తను ఎక్కడ పోటీలో దిగినా తనకు పోటీగా దిగిన అభ్యర్థి చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఆఖరికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అయినాసరే తనపై ఓడిపోవడం ఖాయమని అన్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వచ్చే ఐడియాలు ఎవ్వరికీ రావని కొనియాడారు. అడవిలో కూడా అసెంబ్లీ కట్టగల సామర్థ్యం ఒక్క చంద్రబాబు నాయుడుకే చెల్లిందంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనకు మంత్రి పదవి వస్తుందో రాదో చెప్పలేనని అన్నారు.