శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జులై 2020 (18:20 IST)

తిరుపతిలో అమానుషం.. కరోనా బాధితురాలిని ఇంట్లోకి రానీయని యజమాని

కరోనా కాలంలో మానవత్వం మంటగలసిపోతోంది. మానవత్వం మరుగునపడిపోతోంది. తిరుపతిలో కరోనా వైరస్‌ బాధితురాల పట్ల ఓ ఇంటి యజమాని అమానుషంగా వ్యహరించారు.

కరోనా నుంచి పూర్తిగా కోలుకొని వచ్చిన చంద్రకళ అనే మహిళను యజమాని ఇంట్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె తన ఇద్దరు కుమార్తెలతో ఇంటి ఎదుట నడిరోడ్డు మీద ఉండిపోయింది.

చంద్రకళ కొన్నేళ్ల నుంచి తన భర్త, ఇద్దరు పిల్లలతో సుందరయ్య నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల చంద్రకళకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెతోపాటు కుటంబం మొత్తం క్వారంటైన్‌కు వెళ్లారు.

14 రోజులపాటు క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న తర్వాత వారికి నెగటివ్‌గా రిపోర్టు వచ్చింది. అనంతరం ఇంటికి వచ్చిన వారి పట్ల ఇంటి యజమాని వ్యవహరించిన తీరుతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.