బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Mohan
Last Modified: గురువారం, 11 జనవరి 2018 (15:36 IST)

మరో భారీ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ను ప్రారంభించిన 'ఇస్రో'

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా భారీ ప్రయోగానికి సిద్ధమైంది. గతేడాది ఫిబ్రవరి నెలలో ఒకేసారి 105 ఉపగ్రహాలను ఒకేసారి ఫ్రయోగించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు పీఎస్‌ఎల్‌వీ-సీ40 రాకెట్ ద్వారా మూడు స్వదేశీ ఉపగ్రహాలతోపాటు 28 విదేశీ ఉపగ్రహాలను అంత

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా భారీ ప్రయోగానికి సిద్ధమైంది. గతేడాది ఫిబ్రవరి నెలలో ఒకేసారి 105 ఉపగ్రహాలను ఒకేసారి ఫ్రయోగించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు పీఎస్‌ఎల్‌వీ-సీ40 రాకెట్ ద్వారా మూడు స్వదేశీ ఉపగ్రహాలతోపాటు 28 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు ఈ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ రోజు ఉదయం 5.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సరిగ్గా 28 గంటల తర్వాత శుక్రవారం ఉదయం 9.29 గంటలకు దీన్ని ప్రయోగించనున్నారు. 
 
ఇస్రో ప్రయోగించనున్న 31 ఉపగ్రహాలలో కార్టోశాట్-2 ప్రధానమైనది. భూ ఉపరితల పరిస్థితులను విశ్లేషించి, సమాచారాన్ని తిరిగి భూ నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించేలాగా ఈ ఉపగ్రహాలను రూపొందించారు. తొలిసారిగా 2007 జనవరి 10న కార్టోశాట్‌ను ప్రయోగించారు. తాజా ప్రయోగంతో మైక్రో, నానో ఉపగ్రహాలతోపాటు అమెరికా, ఫ్రాన్స్, ఫిన్లాండ్, కొరియా, కెనడా లాంటి ఆరు దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. 
 
గతేడాది పీఎస్‌ఎల్‌వీ సీ37 ద్వారా వివిధ దేశాలకు చెందిన 105 ఉపగ్రహాలను ఏకకాలంలో నింగిలోకి పంపిన ఇస్రో, ప్రపంచ దేశాల నుండి ప్రశంశలను అందుకుంది. తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ప్రపంచదేశాలకు భారత్ ప్రత్యామ్నాయంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.