ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (10:32 IST)

జగన్ సిద్ధం సభ.. భారీగా జనం... ఏర్పాట్లు పూర్తి

jagan
సిద్ధం సభల ద్వారా ఏపీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దెందులూరులో శనివారం రెండో సభ జరగనుంది. ఈనాటి సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణంలో 12 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 
 
10 ప్రాంతాల్లోని 150 ఎకరాల స్థలంలో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. 3,298 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.20 గంటలకు దెందులూరులోని హెలిప్యాడ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 4.45 గంటల వరకు ఆయన సభలో ప్రసంగించనున్నారు.
 
భీమిలీ సభను మించి ఉండేలా ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో, అంటే మొత్తం 50 నియోజకవర్గాల ప్రజలతో భారీ సభకు రూపకల్పన చేశారు. ఈ సభకు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులోని సహారా గ్రౌండ్స్ లో ఈ సభ జరుగుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.