గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (10:45 IST)

కొండగట్టుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ ప్రచార రథం "వారాహి"

varahi vechicle
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టుకు బయలుదేరారు. తాను ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించేందుకు ఆయన బయలుదేరారు. హైదరాబాద్ నగరంలోని తన నివాసం నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు కొండగట్టుకునే పవన్ కళ్యాణ్.. అక్కడ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. ఈ వాహనానికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి, ఆ తర్వాత ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. 
 
ఆ తర్వాత కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నేతలతో జనసేనాని ప్రత్యేకంగా సమావేశమవుతారు. అక్కడి నుంచి ఆయన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నుంచి అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడుతారు. 
 
ఇందులోభాగంగా, ఆయన 31 నారసింహా క్షేత్రాలను ఆయన దశలవారీగా సందర్శిస్తారు. ధర్మపురి దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు, ధర్మపురి ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.