ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (09:20 IST)

పవన్‌కు అంతుందా.. అంత మగాడా ఏంటి? మంత్రి అంబటి రాంబాబు

ambati
ఏపీలోని వైకాపా నేతలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపాను అధికారంలోకి రాకుండా అడ్డుకునేంత మగాడా పవన్ కళ్యాణ్ అంటూ సూటిగా ప్రశ్నించారు. ఒక్క చోట కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడతారా? అంటూ నిలదీశారు. 
 
పైగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకున్న తన వెంట ఉంటారో లేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసే పవన్ కళ్యాణ్ ఉంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఆయన అన్నారు. పైగా, విపక్షాలను తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరన్నారు. 
 
అందుకే పవన్ కళ్యాణ్ తనను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు దొడ్లో కట్టేసేందుకు పవన్ యత్నిస్తున్నారని, తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా తనపై విమర్శలు గుప్పింస్తున్నారంటూ మండిపడ్డారు.