శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (13:28 IST)

వైకాపాపై జనసేన పోరాటం.. జగనన్న ఇళ్ల పథకంపై సోషల్ ఆడిట్

వైకాపా సర్కారుపై జనసేన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. జగనన్న ఇళ్ల పథకంపై సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు జనసేన సిద్ధమైంది. ఇప్పటికే 'జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు' పేరుతో జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. 
 
తాజాగా జగనన్న ఇళ్ల పథకంపై సోషల్ ఆడిట్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల కాలనీలు, టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను జనసేన నేతలు పరిశీలించనున్నారు. 
 
ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలోని అతి పెద్ద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తారని వైకాపా సర్కారు ఓ ప్రకటనలో వెల్లడించింది. విజయనగరంతో పాటు రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జరిగే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో కూడా పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలుస్తోంది.