మద్యంనే కాదు... నిన్ను కూడా తాకట్టు పెట్టేస్తారు!!
ఏపీ ఎక్సయిజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని మాజీ మంత్రి జవహర్ దుయ్యబట్టారు. మాపై సవాళ్ళు మానేసి, ముందు ఆ మందు శాఖ పనులను చూస్తే మంచిందని ఆయనకు సలహా ఇచ్చారు.
ఇటీవల దళితులపై దాడులను వెనకేసుకొస్తూ, మంత్రి నారాయణ స్వామి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పనితో నారాయణ స్వామికి సరిపోతుంది... సవాళ్ళతో పాకి పనికి కుదిరితే, అదే పని శాశ్వతమౌతుందని ఎద్దేవా చేశారు.
తెలుగు దేశం ఇచ్చిన మాటకు నిలబడుతుందని, మరి మీరు ఇచ్చిన మద్యపాన నిషేధం సంగతేంటో తేల్చాలని జవహర్ సవాలు చేశారు. మద్యం శాఖనే కాదు, ఆదమరిస్తే నిన్ను కూడా తాకట్టులో ఉంచుతారని మంత్రి నారాయణ స్వామిని జవహర్ హెచ్చరించారు.
ఉప ముఖ్య మంత్రి అంటే, ఉపాహారం అనుకునే నువ్వు...ముందు ఆ మంత్రి పదవిని ఎలా వెలగబెట్టాలో చూడు అని ఎద్దేవా చేశారు. దళితులపై దాడుల సంగతి చూడు స్వామి... తర్వాత మా సంగతి మాట్లాడుదువుగాని అంటూ మాజీ మంత్రి జవహర్ విరుచుకుపడ్డారు.