గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (14:51 IST)

శిఖా చౌదరి‌ది క్రిమినల్ మైండ్... నా భర్త హత్యకు ఆమె కారణం... వదిలిపెట్టొద్దు...

తన భర్త హత్యకు ప్రధాన కారణం శిఖా చౌదరేనని, ఆమెను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఎన్నారై జయరామ్ భార్య పద్మశ్రీ వ్యాఖ్యానించింది. శిఖా చౌదరిది క్రిమినల్‌ మైండ్‌ అని, పోలీసులు ఒత్తిడికి తలొగ్గిన ఆమెను మాత్రం వదిలిపెట్టొద్దని కోరింది. 
 
జయరామ్ హత్య కేసు తర్వాత పద్మశ్రీ వద్ద పోలీసులు స్టేట్మెంట్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎక్స్‌ప్రెస్‌ టీవీలో చేరాక కూడా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, అందుకే తప్పించారన్నారు. జయరామ్‌కు 2015 నుంచి ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ఆయన బంధువుల నుంచే జయరామ్‌కు ప్రాణహాని ఉందన్నారు. హత్య కేసు దర్యాప్తును పారదర్శకంగా చేయాలన్నారు.