గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (15:29 IST)

ఇతరుల ముందు అలా మాట్లాడింది.. భార్యను 40సార్లు కత్తితో పొడిచి?

భార్యాభర్తల గొడవలు సాధారణమే. అయితే హర్యానాలో భర్తను ఇతరుల ముందు అదేపనిగా హేళన చేసి మాట్లాడటం.. ఇతరుల ముందు తీసిపారేయడం చేసింది. అంతే ఎంతో సహనంతో వుండిన భర్త.. ఆవేశానికి గురైనాడు. అంతే భార్యను హతమార్చాడు. ఈ ఘటన హర్యానా, గుర్గామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుర్గామ్‌ ప్రాంతానికి చెందిన పంకజ్‌కు వన్షిక శర్మతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగినప్పటి నుంచి భార్య భర్తను తీసిపారేశాలా మాట్లాడటం.. ఇతరుల ముందు అతనిని హేళన చేస్తువుండేది. ఇలా ఆదివారం కూడా భర్తను దూషించింది. 
 
ఇతరుల ముందు హేళన చేసింది. ఇక సహనం కోల్పోయిన పంకజ్... భార్య వన్షికపై కక్ష్య కట్టాడు. ఆమె నిద్రించిన వెంటనే 40సార్లు కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వన్షికా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం కోసం పంపారు. పంకజ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.