ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 22 డిశెంబరు 2017 (17:04 IST)

పోలీసులూ జాగ్రత్తగా ఉండండి.. జెసీ హెచ్చరిక...

అధికారం మనదే అయితే ఏదైనా చేయవచ్చని ప్రజాసంఘాలు విమర్శిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటిదే జరుగుతుందేమో అనిపించక మానదు. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ప్రజాప్రతినిధులు ఇలాగే వ్యవహరిస్తున్నారు. అందులో అనంతపురం జిల్లాకు చెందిన జెసీ బ్రదర్స్ ఖచ్చితంగా ముందుంటా

అధికారం మనదే అయితే ఏదైనా చేయవచ్చని ప్రజాసంఘాలు విమర్శిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటిదే జరుగుతుందేమో అనిపించక మానదు. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ప్రజాప్రతినిధులు ఇలాగే వ్యవహరిస్తున్నారు. అందులో అనంతపురం జిల్లాకు చెందిన జెసీ బ్రదర్స్ ఖచ్చితంగా ముందుంటారు. ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారంతో వార్తల్లోకి వస్తుంటారు జె.సీ.బ్రదర్స్. తాము అనుకున్నది చేసి తీరేంత వరకు అస్సలు నిద్రపోరు. అది ఎంతటి పనైనా సరే. 
 
అలాంటి జెసీ బ్రదర్స్ పైన అనంతపురం మేయర్ స్వరూప తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎంపి జె.సి.దివాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన ఆమె వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపాయి. అయితే ఆ మాటలకు ఆమె ఎక్కడా క్షమాపణ కూడా చెప్పలేదు. దీంతో జెసి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జె.సి.ప్రభాకర్ రెడ్డి అనుచరుడుగా ఉన్న శివనాయుడు అనే వ్యక్తి స్వరూపకు ఫోన్ చేసి బెదిరించారట. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వెంటనే పోలీసులు శివనాయుడును అరెస్టు చేశారు. తన అనుచరుడినే అరెస్టు చేస్తారా అంటూ పోలీస్టేషన్ లోపల నానా యాగీ చేశారు ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి. దీంతో పోలీసులు చేసేదేమీ లేక శివనాయుడుకు బెయిల్ ఇచ్చి పంపేశారు. అదీ సంగతి.