ఏపీలో ప్రారంభమైన రిలయన్స్ జియో 5జీ సేవలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను రిలయన్స్ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. వచ్చే 2023 నాటికి మరికొన్ని నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సోమవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో 5జీ సర్వీసులను ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిలు ప్రారంభించారు. మరోవైపు, 5జీ సేవల ప్రారంభంపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
ఈ సేవలును తొలుత విజయవాడ, వైజాగ్, తిరుమల, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయని, ఇందుకోసం రూ.6500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని తెలిపారు.
ఈ పెట్టుబడులు ఏపీ పట్ల ఆ సంస్థకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీలోని అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరించాలని జియోను కోరుతున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు.