kadapa: కుర్చీ కోసం నిల్చున్న కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎక్కడ?
కడప: కడప(kadapa) కార్పొరేషన్‌లో మరోసారి కుర్చీ ఫైట్ జరిగింది. సోమవారం ఉదయం కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎప్పటిలాగే రసాభాస నెలకొన్నది. దీనికి కారణం మేయర్ సురేశ్‌కు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేసి టిడిపి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి (Madhavi Reddy)కి కుర్చీ వేయలేదు.
దీనితో తెదేపా ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. మేయర్ సురేశ్‌తో మాధవీరెడ్డి వాగ్వాదానికి దిగారు. తనకు ప్రోటోకాల్ ప్రకారం సీటు ఎందుకు కేటాయించడం లేదో చెప్పాలంటూ నిలదీసారు. నేరుగా మేయర్ పోడియం దగ్గరే నిల్చొని తనకు కుర్చీ వేస్తారా లేదా అంటూ అక్కడే నిరసనకు దిగారు. మహిళలను మేయర్ అవమానించడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆమె ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే కడప కార్పొరేషన్ సమావేశంలో జరిగింది.