ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (20:33 IST)

శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ‌వారం సాయంత్రం కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. కోవిడ్ నేప‌థ్యంలో లాక్‌‌డౌన్ అనంత‌రం మొద‌టిసారిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు గ‌రుడ వాహ‌నంపై ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. 
 
రాత్రి 7 నుండి 8.30 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు  గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 
 
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.

అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
 
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్  జ‌గ‌న్మోహ‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.