బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (15:12 IST)

జగన్ పక్కన కట్టప్పలు, మా జిల్లా కట్టప్ప అలా చెపుతున్నారు: రఘురామకృష్ణ రాజు

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఇసుక పాలసీలో లోపాలున్నాయన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. రాజమండ్రిలో ఇసుక మాఫియా అక్రమాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.
 
ప్రభుత్వం తీసుకోవాల్సిన  చర్యలు తీసుకోవడం లేదని, ఉభయగోదావరి జిల్లాల్లో జరుగుతున్న భూ సమీకరణలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పక్కన చాలామంది కట్టప్పలు ఉన్నారని, తన పక్కన ఉన్న కట్టప్పలను సీఎం జగన్ గుర్తించలేకపోతున్నారు అంటూ విమర్శించారు.
 
తమ జిల్లా వ్యవహారాలను పర్యవేక్షించే కట్టప్ప వాస్తవాలను వక్రీకరించి చెబుతున్నారు అని మండిపడ్డారు.