శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (09:45 IST)

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజంపాలెంలో గుడి.. కట్టించేదెవరంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆలయం నిర్మించేందుకు కట్టేందుకు ఆయన అభిమానులు కొందరు సిద్ధమయ్యారు. పాలక పార్టీ ఎమ్మెల్యే దీనికి శంకుస్థాపన చేశారు. గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో పనులు ప్రారంభించారు. 
 
ఆగస్ట్ 15లోగా గుడి పూర్తవుతుందని కూడా ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని రాజంపాలెంలో ఆగస్ట్ 5న సీఎం జగన్‌కు కడుతున్న గుడికి శంకుస్థాపన చేశారు స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు. వైసీపీ నాయకుడు కరుకూరి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. 
 
సుమారు రూ.10 లక్షల వ్యయంతో గుడి నిర్మిస్తామని ప్రకటించారు. 10 సెంట్లు స్థలంలో గుడి కడుతున్నామని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి పేరుతో గుడి కడుతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పాలక వైసీపీ అది తమ పార్టీ వైఖరి కాదని చెబుతోంది.