ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2017 (12:38 IST)

కేశినేని బస్సులు ఇక తెలుగు రాష్ట్రాల్లో నడవవు.. షట్టర్ క్లోజ్: మంత్రి నాని ప్రకటన

కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ మేరకు తమ కార్యాలయాలను మూసేస్తున్నట్లు శనివారం ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఏర్పడిన ఈ సంస్థ సేవలు శనివారంతో అనూహ్యంగా ముగ

కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ మేరకు తమ కార్యాలయాలను మూసేస్తున్నట్లు శనివారం ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఏర్పడిన ఈ సంస్థ సేవలు శనివారంతో అనూహ్యంగా ముగిశాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించిన బస్సులను ఆంధ్రప్రదేశ్‌లో అనుమతించిన కారణంగా వెల్లువెత్తిన నిరసనలకు ఫలితంగా కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలు మూతపడినట్లు నాని తెలిపారు. ఇంకా బస్సు ప్రమాదాలు పెచ్చరిల్లిపోతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు నాని చెప్పారు. 
 
ఇకపోతే, కేశినేని కార్యాలయాలకు మూతపెట్టినట్లు నాని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆ సంస్థ కార్యాలయం వద్ద 'కేశినేని ట్రావెల్స్' అని ఉన్న బోర్డును శనివారం సిబ్బంది తొలగించారు. కేశినేని ట్రావెల్స్ బస్సులు విజయవాడ నుంచి గుంటూరు, తెనాలి మధ్య తొలినాళ్లలో తిరిగాయి. ఈ బస్సుల రాకపోకలు పెరగడంతో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది.
 
ఇంకా ఆర్టీసీ నష్టాలకు కారణమైన కేశినేని ట్రావెల్స్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని ఈ ఉదయం కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ ఎంపీగా ఉంటూ, అక్రమ మార్గంలో ఆయన పర్మిట్ లేని రూట్లలోనూ బస్సులను తిప్పారని, స్టేజ్ కారియర్లుగా నడిపారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఈ నిరసనల నేపథ్యంలో కేశినేని నాని తమ కార్యాలయాలను మూసేస్తున్నట్లు ప్రకటన చేసి.. కార్మిక సంఘాలకు షాక్ ఇచ్చారు. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో కేశినేని బస్సులు ఇక నడవవు.