శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (08:08 IST)

జ్ఞానం లేని ముఖ్యమంత్రి : వంగలపూడి అనిత

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి చంద్రబాబునాయుడు కృషిచేస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీని అత్యాచారాంధ్రప్రదేశ్ గా మార్చారని, వైసీపీ పాలనలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగికవేధింపులే అందుకు రుజువని టీడీపీమహిళానేత, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టంచేశా రు.
 
18నెలల జగన్ పాలనలో అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో రోజూఏదోఒకచోట మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.  దళితులు, బీసీలు, మైనారిటీలపై జరిగే దాడుల గురించి చెప్పాల్సిన పనిలేదు. 
ముఖ్యమంత్రి సొంతనియోజకవర్గమైన కడపజిల్లా పులివెందుల లోని లింగాలమండలంలోని పెదకూడాల గ్రామంలో 48ఏళ్ల దళిత మహిళ పై  అతిదారుణంగా అత్యాచారం చేసి, చంపేశారు.

తమతమ నియోజకవర్గాల్లో జరిగే చీమచిటుక్కుమన్నా ఎమ్మెల్యే లకు తెలుస్తుంది. అటువంటప్పుడు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగినదారుణం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? విధివక్రీకరించి, జీవితం పాడైన సదరుమహిళ తల్లిదండ్రులవద్ద ఉంటూ మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తోంది. మేకలు ఇంటికి వచ్చినా, ఆమె మాత్రం ఆరోజు ఇంటికి రాలేదు.

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంతదారుణం జరిగితే ఆయన పట్టించుకోరా? జరిగినదారుణంపై టీడీపీఅధినేత చంద్రబాబు డీజీపీకి లేఖరాశారు. ఇంతవరకు మహిళను హతమార్చినవారిని పోలీసులు పట్టుకోలేక పోయారు. పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం నల్లిని నలిపినట్లు నలిపేసిం ది. పోలీసులను ప్రభుత్వం కేవలం కాపలాకు మాత్రమే వాడుకుంటోంది. వైసీపీవారు ఏంచెబితే అదిచేయడానికే పోలీసులు పరిమితమయ్యారు.

టీడీపీవారిపై అక్రమకేసులు పెట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి మాత్రమే పోలీసులను ప్రభుత్వం వినియోగిస్తోంది. పోలీస్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయబట్టే, రాష్ట్రంలో రోజురోజుకీ నేరాలశాతం (క్రైమ్ రేట్) పెరుగుతోంది. ఇప్పుడున్న పోలీసులే గతంలో సమర్థవంతంగా పనిచేశారు. అప్పుడు రాష్ట్రంలో ఉన్నది సమర్థుడైన చంద్రబాబు నాయకత్వం. ఇప్పుడు నిబద్ధత, జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే, రాష్ట్రంలో నేరాలశాతం పెరుగుతోంది. 

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి  కారణం దళితులు, మహిళలు. కానీ ఇప్పుడు ఆరెండు వర్గాలపైనే దాడులు ఎక్కువయ్యాయి. పేర్నినానీని ఎవరోతాపీమేస్త్రి తాపీతో పొడవడా నికి ప్రయత్నిస్తే, హోంమంత్రి, డీజీపీ సవాంగ్ సదరు మంత్రిని పరమర్శించడానికి తరలివెళ్లారు. మంత్రికి సానుభూతి తెలిపి, అడగకుండానే రక్షణ కల్పించారు. 

ఆడబిడ్డలపై  అత్యాచారాలు , దాడులు జరుగుతుంటే, దళితహోంమంత్రిగా ఉన్న ఆమె బాధితులను పరామర్శించాలనే ఆలోచన చేయడంలేదు. సాటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే, కనీసం బుద్ధి, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే ఎలా? అన్న వచ్చాడంటూ ఊదరగొడుతూ ప్రచారం చేసిన వైసీపీవారు, మహిళలకు అన్యాయం జరుగుతుంటే  వారి అన్నఎందుకు రావడంలేదో సమాధానం చెప్పాలి.

ఆడబిడ్డలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే అన్న ఎందుకు రావడం లేదు. అన్న వచ్చాడు అనే నినాదం స్థానంలో పనికిమాలిన అన్నొచ్చాడు అని పెట్టుకోండి. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆమె అప్పుడప్పుడూ బయటకువచ్చి కనిపించి పోతుంటారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగినదారుణాల్లో  కనీసం పదింటిపై కూడా ఆమె స్పందించిన దాఖలాలు లేవు. మొత్తమ్మీద ఒకటో రెండో అంశాలపై మాత్రమే ఆమె స్పందించారు.

తిరుపతి, వైజాగ్ లో జరిగినఘటనలు సహా, వేళ్లమీద లెక్కే పెట్టొచ్చు. ఆమె కళ్లముందే, రాష్ట్రంలో ఇన్నిదారుణాలు జరుగు తుంటే పట్టించుకోరా? మొన్నటికి మొన్న ఆమె మార్చి8న జరగబోయే మహిళాదినోత్సవానికి సంబంధించి ఏదో 100రోజుల కార్యక్రమమని ప్రకటించారు.

వైసీపీ మహిళానేతలు, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్, హోంమంత్రి అన్నొచ్చాడు అనే భ్రమల్లోనే ఉన్నారు. సీఎం సొంతనియోజక వర్గంలో దళితమహిళపై హత్యాచారం జరిగితే, వైసీపీలోని మహిళానేతలు ఎందుకు స్పందించలేదు.  మూకుమ్మడిగా వారి నోళ్లు పడిపోయాయా? చనిపోయిన దళితమహిళకు న్యాయం ఎలాగూ చేయలేకపోయారు సరే, ఆమె కుటుంబాన్ని పరామర్శిం చడానికి ఎందుకు ధైర్యం చేయలేకపోయారు.

కమీషన్ల కోసం 100 రోజుల కార్యక్రమాలు చేయడం మానేసి, మీరు, మీ పోలీసులు  ఒక ప్రణాళికప్రకారం మహిళలపై జరిగే దాడులను ఎలా అరికట్టాలా అని ఆలోచిస్తే మంచిది. అప్పుడైనా మహిళాకమిషన్ పనిచేస్తుందిరా అని ప్రజలు అనుకుంటారు. ఒకటీ, రెండుకాదు దళితులు, మహిళలపై వరుసగా సంఘటనలు జరుగుతున్నా స్పందించక పోతే ఎలా? మాస్క్ లేదని దళితుడిని కొట్టిచంపడం, మాస్క్ అడిగాడని చెప్పి డాక్టర్ ని పిచ్చోడిని చేయడం చేశారు.

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్, హోంమంత్రి, వైసీపీమహిళానేతలు మాట్లాడితే దిశాచట్టమంటారు. దిశాచట్టమే లేకపోతే,  దిశాస్టేషన్ లో ఫిర్యాదుచేస్తే ఎలాన్యాయం జరుగుతుంది. అటువంటివాటి పేరుచెప్పి, ప్రజలను ఎన్నాళ్లు మోసగిస్తారు?  వైసీపీలోని మహిళా నేతలు ఇప్పటికైనా టోల్ గేట్ల వద్దపనిచేసే వారిపై దౌర్జన్యం చేయడంమానేసి, ఆడవాళ్లపై చేయేసినవారి కాలర్ పట్టుకుంటే మంచిది.

కడప ఘటనను పట్టించుకోకుండా, ప్రభుత్వం వదిలేసినా, చంద్రబాబునాయుడు వదిలిపెట్టరు. దళితమహిళకు జరిగిన అన్యాయంపై టీడీపీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేసి, కచ్చితంగా ఆమెకుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేసి తీరుతుందని స్పష్టంచేస్తున్నాను.