బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (16:55 IST)

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

Rose petals
పనీర్ రోజా పువ్వుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పనీర్ రోజా పువ్వులు లేత గులాబీ రంగుల్లో లభ్యమవుతాయి. పనీర్ రోజాలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. పన్నీర్ రోజా అజీర్ణాన్ని నయం చేస్తుంది. 
 
పన్నీర్ రోజా చారు లేదా కషాయం గడ్డకట్టడం పిత్తాన్ని దూరం చేస్తుంది. పనీర్ రోజా కషాయం లేదా చారును తీసుకుంటే చర్మం మెరిసిపోతుంది. రోజా పువ్వులు మొలల వ్యాధికి ఔషధంగా ఉపయోగపడుతుంది. 
 
Rose petals
రోజా పువ్వుల రేకలను తీసి మెత్తగా చేసుకోవాలి. దీంట్లో రెండు చుక్కల తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాలపాటు ఉంచుకుని చన్నీటితో కడిగేయాలి. అర టీస్పూన్ బాదం నూనెలో మెత్తగా మెదిపిన రోజా రేకలు కలిపి పేస్ట్‌లాగా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. 
 
రోజా రేకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఒక టీస్పూన్ పాలల్లో అర టీస్పూన్ రోజా రేకుల పొడిని, పావు టీ స్పూన్ శనగపిండిని కలిపి ప్యాక్ చేయాలి. శుభ్రపరచి ముఖానికి ఈ ప్యాక్‌ను పట్టించి, ఆరిన తరువాత చన్నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.