మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2024 (21:34 IST)

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అల్లం టీ. అల్లంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ డయాబెటీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కేన్సర్, బరువు తగ్గించడమే కాకుండా మెదడు, గుండె-రక్షిత ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇంకా అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
అల్లం టీ తాగితే రక్తపోటు అదుపులో వుంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
బరువు తగ్గించడంలోనూ, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.
శరీరంలో నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందేట్లు మేలు చేస్తుంది.
అల్లం టీకి క్యాన్సర్-పోరాట లక్షణాలు వున్నట్లు చెబుతారు.
అల్లం టీ తాగుతుంటే మెదడు ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
రోజుకు 4 గ్రాముల అల్లంను సురక్షితంగా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
పడుకునే ముందు అల్లం టీ తాగడం మంచిదే, ఎందుకంటే అల్లం టీని కెఫిన్ రహితంగా పరిగణిస్తారు.