Kodali Nani: కోల్‌కతా నుంచి కొలంబోకు కొడాలి నాని-ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

సెల్వి
బుధవారం, 18 జూన్ 2025 (11:08 IST)
మాజీమంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై పలు కేసులు వున్నాయి. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు కోల్కత్తా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోల్‌కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 
 
వైసీపీ హయాంలో కోడాలి నాని అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత కొడాలి నాని పైన కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో కొడాలి నాని ఆస్పత్రిలో చేరారు. 
 
ముంబైలోని ఆస్పత్రిలో నానికి బైపాస్ సర్జరీ చేశారు. క్రమేణా కోలుకుంటున్న కొడాలి నాని కొద్ది రోజులుగా తిరిగి వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరువుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక వివాహ వేడుకలో నాని హాజరైన ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే సమయం లో కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. 
 
కాగా, తాజాగా కొలకత్తా నుంచి కొలంబో వెళ్తున్న కొడాలి నానిని పోలీసులు ఆపారు. లుకౌట్ నోటీసుల కింద కొడాలి నానిని అడ్డుకున్న పోలీసులు.. ఏపీలో పోలీసుల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments