లుకౌట్ నోటీసు దెబ్బకు కలుగులోని ఎలుక బయటకు వచ్చింది.. (Video)
వైకాపా నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా కేంద్ర హోం శాఖ లుకౌట్ నోటీసు జారీచేసింది. ఈ నోటీసు దెబ్బకు గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన శుక్రవారం రాత్రి ఒక్కసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఓ వివాహ వేడుకలు ఆయన హాజరయ్యారు. గుండె ఆపరేషన్ తర్వాత ఆయన తొలిసారి బయటకు కనిపించారు. శుక్రవారం కృష్ణా జిల్లాల పోలీసులతో పాటు కేంద్ర హోం శాఖలు లుకౌట్ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా బాహ్య ప్రపంచంలోకి రావడం గమనార్హం.
కాగా, కేంద్ర హోం శాఖ లుకౌట్ నోటీసుల జారీతో ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో, అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. భూమార్గం, వాయుమార్గం, జలమార్గం అనే తేడా లేకుండా అన్ని చోట్లా నిఘా పెట్టాలని ఈ ఆదేశాల్లో స్పష్టంచేసింది. ఈ కారణంగా మరోమార్గం లేకపోవడంతో ఆయన బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్టు తెలుస్తోంది.