గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (17:29 IST)

ఈ నెల 30న వైసిపిలోకి మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి?

రాజకీయ పార్టీల నాయకులు చాలా ఈజీగా పార్టీలను మార్చేస్తున్నారు. షర్ట్ మార్చినంత ఈజీగా వీరు పార్టీలను మార్చేస్తున్నారు. అందులోను రాజకీయాల్లో తలపండిన నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు పార్టీలను వెతుక్కుంటున్నారు. తమకున్న పరిచయాలతో ఎలాగోలా కండువా కప్

రాజకీయ పార్టీల నాయకులు చాలా ఈజీగా పార్టీలను మార్చేస్తున్నారు. షర్ట్ మార్చినంత ఈజీగా వీరు  పార్టీలను మార్చేస్తున్నారు. అందులోను రాజకీయాల్లో తలపండిన నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు పార్టీలను వెతుక్కుంటున్నారు. తమకున్న పరిచయాలతో ఎలాగోలా కండువా కప్పుకుని గుట్టు చప్పుడు కాకుండా పదవులను పొందే ప్రయత్నం చేసేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి పనే చేస్తున్నారు మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి.
 
కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డికి కర్నూలు జిల్లాలో మంచి పేరే ఉంది. ఇప్పటికే సీనియర్ నేతగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలోఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ కాస్తా కష్టకాలంలో ఉండటంతో పార్టీ మారాలన్న నిర్ణయాన్ని కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఎప్పుడో తీసేసుకున్నారు. కానీ సమయం అనుకూలించకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. 
 
ఇప్పుడైతే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు పూర్తిస్థాయిలో జరిపి ఇక పార్టీ మారాలన్న ఒక నిర్ణయానికే వచ్చేశారు. కర్నూలు జిల్లాలో కాస్త పట్టున్న నేత కోట్ల. అలాంటి వ్యక్తిని తమ పార్టీలోకి తీసుకుంటే లాభమేనన్న ఆలోచనలో జగన్ కూడా ఉన్నారు.
 
ఈ నెల 30వ తేదీ పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి. సోమవారం కోట్లకు బాగా కలిసొచ్చిన రోజట. అందుకే ఆ రోజునే జగన్ సమక్షంలో పార్టీ కండువా వేసుకోవాలన్నది ఆయన ఆలోచన. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన బుట్టా రేణుక అధికార పార్టీలోకి వెళ్ళిపోవడంతో వైఎస్ఆర్‌సిపికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అయితే పార్టీని ముందుండి తీసుకెళ్ళగలిగే సత్తా ఉందనేది జగన్ ఆలోచన. చూడాలి... ఏం జరుగుతుందో?